నాగ చైతన్య 'వృషకర్మ': రాజస్థాన్ షెడ్యూల్ పూర్తి.. త్వరలో రిలీజ్ డేట్

  • నాగ చైతన్య హీరోగా 'వృషకర్మ' 
  • వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్, సీజీఐ పనులు
  • మునుపెన్నడూ చూడని మైథికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న సినిమా
  • త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్న చిత్ర బృందం
అక్కినేని నాగ చైతన్య హీరోగా, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వృషకర్మ'. ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌కు సంబంధించి చిత్ర బృందం శనివారం ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. రాజస్థాన్‌లో జరిపిన కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. "వృషకర్మ బృందం రాజస్థాన్‌లోని రాజకోటల మధ్య ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా భారీ సీజీఐ వర్క్ వేగంగా జరుగుతున్నాయి. భారత ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అని మేకర్స్ తెలిపారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచింది. దుష్టశక్తి ఆవహించిన వ్యక్తి వేసిన చిత్రం ప్రకారమే హత్య జరగడం వంటి అంశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇంత భారీ స్థాయిలో, హెవీ వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన సినిమా చేయలేదని నాగ చైతన్య గతంలోనే పేర్కొన్నారు.

సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ కథ అందించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Naga Chaitanya
Vrushakarma
Karthik Dandu
Mythological Thriller
Rajasthan Schedule
SVCC
Meenakshi Chaudhary
Sukumar Writings
Telugu Movie Release Date

More Telugu News